కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా మహిళలకు ఉచితంగా ప్రయాణ సదుపాయాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తుండగా ఉచిత ప్రయాణం కోసం ఓ వ్యక్తి ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ఉచిత బస్సు పథకాన్ని పొందాలని ధార్వాడ్ జిల్లాకు చెందిన వీరభద్రయ్య అనే వ్యక్తి ఏకంగా బుర్ఖా వేసుకొని మహిళగా అవతారం ఎత్తాడు. మహిళ పేరిట ఉన్న ఆధార్ కార్డు చేత్తో పట్టుకొని ధార్వాడ్ జిల్లా బస్ స్టాప్ లో బస్ స్టాప్ లో ఒంటరిగా కూర్చొని ఉండగా గమనించిన చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి అతన్ని ప్రశ్నించారు.
Also Read:ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్‌గా భూపాల్ రెడ్డి..
తాను భిక్షాటన చేసేందుకే తాను బురఖా ధరించి మహిళ వేషం వేశానని చెప్పగా గట్టిగా నిలదీయడంతో అసలు విషయం చెప్పాడు. ఉచిత బస్సు ప్రయాణం కోసం మహిళా వేషం వేసుకున్నానిన వెల్లడించారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read:సింగరేణి ఉద్యోగులకు శుభవార్త..