రాష్ట్రంలో పెద్దఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు: సీఎం కేసీఆర్

409
SANJIV PURI
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్ధాపించేందుకు ప్రభుత్వంతో కలిసి రావాలని సీఎం కేసీఆర్ ఐటిసి లిమిటెడ్ ను కోరారు. ప్రగతి భవన్ ఇవాళ సాయంత్రం సీఎం కేసీఆర్‌ను ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పూరి, సభ్యులు కలిశారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రావడంతో పాటు, ప్రజలకు నాణ్యమైన, కల్తీలేని ఆహార పదార్ధాలు అందించాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలిపారు సీఎం.

cm kcr Itc

మెదక్ జిల్లా మనోహరాబాద్ సమీపంలో రూ.800కోట్ల వ్యయంతో ఐటీసీ చేపట్టిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులు పూర్తైనట్లు తెలిపారు. మరో రెండు మూడు నెలల్లో ప్రారంభించాడనికి సిద్దంగా ఉన్నాయని చెప్పారు.

తెలంగాణలో అతిపెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను తక్కువ సమయంలోనే నిర్మించినందుకు సీఎం వారిని అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింట్ యూనిట్లు నెలకొల్పాలన్నారు సీఎం. ములుగు జిల్లాలో రేయాన్స్ ఫ్యాక్టరీ పునరుద్దరణకు ఐటీసీ చొరవ చూపాలని సీఎం కోరారు.

- Advertisement -