- Advertisement -
తెలంగాణలోని మరో ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ సంఘటన చోటు చేసుకుంది. ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కాగా 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
విద్యార్థులకు పచ్చడితో అన్నం పెట్టింది పాఠశాల సిబ్బంది. దీంతో అస్వస్థతకు గురికాగా వెంటనే విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పాఠశాల సిబ్బంది. ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుండగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ మధ్య కాలంలో వరుసగా ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరుగుతున్న ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి చలనం ఉండటం లేదని పలువరు మండిపడుతున్నారు.
Also Read:డొనాల్డ్ ట్రంప్ దావా.. రూ.216 కోట్లు!
- Advertisement -