లాక్ డౌన్ పాటించండి: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

352
india lockdown
- Advertisement -

వికారాబాద్ లో కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రజలంతా తప్పనిసరి గా లాక్ డౌన్ ను పాటించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. వికారాబాద్ నియోజకవర్గములో కరోనా దృష్ట్యా ఏర్పడిన పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిత్యావసరాల పంపిణీ,ధాన్యం కొనుగోలు తదితర అంశాల పై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్,కలెక్టర్ పౌసుమి బసు, ఎస్ పి నారాయణ,రాష్ట్ర విద్య మౌలిఖా సదుపాయాల ఛైర్మెన్ ఛైర్మెన్ నాగేందర్ గౌడ్,వివిధ శాఖల అధికారులతో కలిసి శనివారం మంత్రి సమీక్షించారు.

ఈ సందర్భంగా ప్రస్తుతం కేసుల సంఖ్య జిల్లాలో 10 కి పెరగటంతో వ్యాధి ప్రబలకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని పోలీస్ ,వైద్య ,మునిసిపల్ అధికారులను ఆదేశించారు. వికారాబాద్ నియోజకవర్గంలో మొత్తం 8 సి జోన్లు ఉంటే ఒక్క వికారాబాద్ లోనే 5 సి జోన్లు గా ప్రకటించరారాని, ఈ ప్రాంతలలో కూరగాయలు, ఇంటింటికె పంపిణీ చేయటం జరుగుతుందని,ఆ ప్రాంతాలను పూర్తిగా దిగ్భందం చేసి,అవసరమైన మేరకు చర్యలు చేపట్టాలన్నారు.వికారాబాద్ జిల్లాలో 15 వేల మంది సి జోన్ లో ఉన్నారని ,వారికి కావాల్సిన ఏర్పాట్ల పై కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారన్నారు. వికారాబాద్ జిల్లాలో మొత్తం 10 కేసులు నమోదు అయితే అందులో సగానికి పైగా వికారాబాద్ నియోజకవర్గము నుండే ఉండటం ఆందోళన కల్గించే అంశం అని,ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటిస్తూ, కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేపించుకోవలన్నారు.

వికారాబాద్ లోని ఏరియా ఆస్పత్రికి గర్భిణి లు,ఇతర అత్యవసరము ఉన్న వాళ్ళు వెల్తునందున,దగ్గు,జలుబు,జ్వరం,గొంతులో నొప్పి,శ్వాస కోసఇబ్బందులు,కరోనా లక్షణాలు ఉన్న వారు మహావీర్ ఆస్పత్రికి కి వెళ్లాలని మంత్రి కోరారు.ప్రజలు పూర్తి సంయమనం పాటించాలని,లాక్ డౌన్ పాటించాలని,ఇళ్లలోనే ఉండాలని,బయటకు రావొద్దని,సామాజిక దూరం పాటించాలని,మంత్రి కోరారు.అధికారులు 24 గంటలు కష్ట పడుతున్నారని ,వైద్య,మునిసిపల్,పోలీస్,రెవిన్యూ,పంచాయితీ రాజ్,తదితర శాఖల అధికారులు బాగా పనిచేస్తున్నారని,వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.,చిన్న స్థాయి ఉద్యోగి నుండి కలెక్టర్ వరకు,కౌన్సిలర్ నుండి మునిసిపల్ చైర్మన్ వరకు, ఎం ఎల్ ఏ లు కూడా బాగా కష్టపడుతున్నారని వారందరి కృషి కూడా ఎంతో గొప్పదన్నారు. ఆశ వర్కర్లు,ఏ ఎన్ ఎం లు, ఇంటింటికి తిరిగి కరోనా పై వివరాలు సేకరిస్తున్నారని వారి సేవలు కూడా ఎంతో గొప్పవని,ప్రజలంతా వారికి సహకరించాలన్నారు .కంటికి కనపడని శత్రువు తో జరుగుతున్న పోరాటం లో ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి ప్రజలను కోరారు. హోమ్ క్వారయింటైన్ లో ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని ఏమన్నా వ్యాధి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలన్నారు.ఢిల్లీలో ని మార్కజ్ లో జరిగిన ప్రార్ధనల కు వెళ్లి వచ్చిన వారు ఉంటే వెంటనే స్వచందంగా బయటకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని,ప్రభుత్వం వారికి ఉచితంగా వైద్యం చేస్తుందన్నారు.బయటకు రాకుంటే వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనునిత్యం కరోనా పై సమీక్షలు ,సమావేశాలు నిర్వహిస్తున్నారని ,అందులో భాగంగానే నేడు కాబినెట్ సమావేశం కూడా ఏర్పాటు చేశారని మంత్రి అన్నారు.తెలంగాణ లో ఒక్క కేసు పొసిటివ్ గా నమోదు కాగానే గౌరవ ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకున్నారని అన్నారు..ప్రభుత్వం రోజుకు 600 కోట్లు నష్ట పోతున్న కూడా ప్రజల ఆరోగ్యం దృష్ట్యా లాక్ డౌన్ ను అమలు చేస్తుందన్నారు.భవిష్యత్ లో పొడిగింపు జరిగిన ప్రజలంతా సహకరించాలని మంత్రి కోరారు.ఉదయం పూట సరుకుల కోసం ఒకే సారి రాకుండా ,ఒక సారి వచ్చినపుడు వారం కు సరిపడే సరుకులను తీసుకోవాలని ప్రజలను కోరారు.ఈ దిశ గా పోలీస్ అధికారులు కూడా పెట్రోలింగ్ పెంచాలని ఆదేశించారు..రేషన్ కార్డు పై ప్రతి కార్డుకు 1500 రూపాయలు బ్యాంక్ ఖాతాలో పడుతున్నాయని,వాటి కోసం వెంటనే బ్యాంక్ ల వద్దకు వెళ్ళొద్దని,అవసరం ఉన్న వాళ్ళు తీసుకోవాలని డబ్బులు ఎక్కడ పోవని,ఎప్పుడైనా తీసుకోవచ్చన్నారు.రోడ్ల పై ఉమ్మి వేయటం పై ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చిందని అందరూ దానిని పాటించాలని,బయటకు వస్తే తప్పనిసరి గా మాస్క్ ధరించాలన్నారు.

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 2,34,983 రేషన్ కార్డుల పై 8.07.601 మంది కి 96,91,212 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో గుర్తించిన 6288 మంది వలస కార్మికులకు 12 కిలోల చొప్పున 75,456 టన్నుల బియ్యం పంపిణీ చేసినట్లు తెలిపారు. వికారాబాద్ నియోజకవర్గ ములో 62,449 రేషన్ కార్డుల పై 2,05,090 మంది లబ్ధిదారులకు 12 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.రైతులు పండించిన పంటను గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.జిల్లాలో మొత్తం 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తారని మంత్రి తెలిపారు.రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి అన్నారు.

వికారాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని రాజీవ్ గృహ కల్ప లో మంత్రి పర్యటించారు.ఎం ఎల్ ఏ మెతుకు ఆనంద్,కలెక్టర్ పౌసుమి బసు ,మునిసిపల్ చైర్ పర్సన్ చిగుళ్ల పల్లి మంజుల రమేష్ లతో కలిసి పర్యటించారు.వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ ,సామాజిక దూరం పాటించాలని,స్వీయ రక్షణ నే శ్రీరామ రక్ష అన్నారు.గృహ కల్ప లో ప్రజలు ప్రభుత్వ నికి సహకరించాలన్నారు.

- Advertisement -