సెక్స్‌ టాయ్స్‌ వాడు .. సన్నీని ఆదర్శంగా తీసుకో

325
Follow Sunny says Principal
- Advertisement -

విద్యాబుద్దులు నేర్పాల్సిన ప్రిన్సిపాల్ కీచకుడిగా మారాడు. విద్యార్థిని లొంగదీసుకునేందుకు మాయమాటలు చెప్పాడు. నా కోరిక తీరిస్తే అన్నివిధాలుగా అండగా ఉంటానన్నాడు. మాట వినకుంటే నీకు జీవితమే లేకుండా చేస్తానని బెదిరింపులకు దిగాడు. చివరికి విషయం వెలుగులోకి రావటంతో పరారీలో ఉన్నాడు ఆ కీచక ప్రిన్సిపాల్.

వివరాల్లోకి వెళ్తె బెంగళూరు కేంద్రీయ విద్యాలయంలో లైంగిక వేదింపుల సంఘటనలు వెలుగుచూశాయి. ప్రిన్సిపాల్‌పై చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098కు ఫిర్యాదులు కూడా అందాయి.దీంతో డీపీఐ అధికారులు శుక్రవారం విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా డీపీఐ అధికారులకు ఉహించని అనుభవం ఎదురైంది. పదో తరగతి నుంచి 12వ తరగతి అమ్మాయిలను ప్రిన్సిపాల్‌ కుమార్‌ లైంగికంగా వేధించడం, అసభ్యంగా ప్రవర్తించడం చేస్తున్నాడని కేవీ ఉద్యోగి ఒకరు చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ దృష్టికి తీసుకొచ్చారు.

Follow Sunny says Principal

ప్రిన్సిపాల్ చేసిన దాష్టికాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారు. బాయ్‌ఫ్రెండ్‌ను పెట్టుకో. సన్నీ లియోన్‌ ఆదర్శంగా తీసుకో. శృంగార సాధనాలు వాడు. నన్ను తరచూ కలుస్తూ ఉండు. నేను నీకు నైతికంగా, సామాజికంగా, ఆర్థికంగా మద్దతుగా నిలుస్తాను. నా మాట వినలేదనుకో.. నీకు క్లాస్‌ ఫస్ట్‌ మార్కులు వచ్చే అవకాశాలు కోల్పోతావు’ అంటూ బెదిరించే వాడని తెలిపింది.

ఈ ఘటనపై బాధిత విద్యార్ధిని పోలీసులకు సైతం ఫిర్యాదుచేసింది. బెంగళూరు సీవీ రామన్‌ రోడ్డులో ఉన్న కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్‌ కుమార్‌ ఠాకూర్‌ తన పట్ల ఇలా అసభ్యంగా ప్రవర్తించాడంటూ పేర్కొంది. ఫిజిక్స్‌ టీచర్‌ షణ్ముగం తనను ప్రిన్సిపాల్‌ చాంబర్‌కు తీసుకెళ్లాడని, అక్కడ తనను తరచూ కలువాలంటూ అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తన ఫిర్యాదులో తెలిపింది. తనకు ప్రిన్సిపాల్‌ చాక్లెట్‌ ఇచ్చాడని, ఆ తర్వాత బయటకు వచ్చి చూస్తే బయట లైట్లు కూడా లేవని తెలిపింది.

- Advertisement -