నాగ్ గదిలోకి సమంత..

91
samantha

మరికొన్ని రోజుల్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత..అక్కినేని వారి కోడలుగా అడుగుపెట్టబోతోంది. నాగ చైతన్యను ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న అమ్మడు…ఇప్పటికే నాగార్జున కోడలుగా హాట్ టాపిక్‌గా మారింది. సమంత..మామ నాగార్జున సినిమాలో నటించనుందట. ఇది వరకే మనం సినిమాలో నాగార్జున తో కలిసి నటించిన బబ్లీ బ్యూటీ ..మరోసారి కింగ్ తో నటించబోతోంది. ప్రస్తుతం ఓం నమో వేంకటేశాయ సినిమాతో బిజీగా ఉన్న నాగ్‌ నెక్ట్స్ సినిమాను కూడా లైన్లో పెట్టాడు. టీవీ యాంకర్గా ఎంట్రీ ఇచ్చి తరువాత డైరెక్టర్గా సక్సెస్ సాధించిన ఓంకార్ దర్శకత్వంలో రాజుగారి గది సినిమాకు సీక్వల్గా రాజుగారి గది2 తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

samantha

నాగ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు సందడి చేయనున్నారు. ఇప్పటికే ఒక హీరోయిన్గా రన్ రాజా రన్ ఫేం సీరత్ కపూర్ను ఎంపిక చేయగా మరో కీలక పాత్రకు స్టార్ హీరోయిన్ సమంతను ఫిక్స్ చేశారు. మరో హీరోయిన్ ఎంపిక జరగాల్సి ఉంది. గతంలో నాగార్జున, సమంతలు మనం సినిమాలో కలిసి నటించారు. రాజుగారి గది 2లో కూడా నాగ్, సమంత పాత్రలు మనం తరహాలోనే ఉండే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.

samantha