సీఎం కేసీఆర్‌కు వందనాలు తెలిపిన గద్దర్..

121
- Advertisement -

యాదాద్రి లక్ష్మీ నారసింహస్వామి వారిని కుటుంభ సమేతంగా దర్శించుకున్నారు ప్రజా గాయకుడు గద్దర్. అనంతరం రాతితో నిర్మించిన ప్రధానాలయ కట్టడాలను, శిల్ప కళా ఖండాలను గద్దర్ తిలకించారు. ప్రభుత్వ వ్యయంతో,ప్రకృతి దేవతలను ప్రతిష్టిస్తు మహాద్బుతంగా యాదాద్రి ఆలయాన్ని నిర్మించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గద్దర్ వందనాలు తెలిపారు. యాదాద్రి ఆలయం తేజోవంతంగా ఉన్నట్లు గానే తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి కోరుకున్నట్లు గద్దర్ తెలిపారు. ఈ సందర్భంగా యాదాద్రి స్వామివారిపై పాట కట్టి పాడారు.

- Advertisement -