కళా తపస్వి కె. విశ్వానథ్ ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. కాగా శనివారం సాయంత్రం హైదరాబాద్ లో ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ( ఎఫ్.ఎన్.సీ.సీ) ఆధ్వర్యంలో కె.విశ్వనాధ్, గాయకుడు ఎస్. పి.బాలసుబ్రమణ్యం లను ఘనంగా సన్మానించింది. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీ , విశ్వనాథ్ ని సన్మానించారు. అలాగే కథానాయకుడు వెంకటేష్, గాయకుడు ఎస్. పి బాలసుబ్రహ్మణ్యంను సత్కరించారు.
అనంతరం కె. విశ్వనాథ్ మాట్లాడుతూ, ` అవార్డు వచ్చిందని నేను ఇవాళ్ల ఇక్కడికి రాలేదు. ఒక సామాన్యుడిగా ఇక్కడికి వచ్చాను. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఈరోజు నాకొచ్చింది. రేపు మరొకరికి వస్తుంది. నేనెప్పటికి కాశీ నాథుని విశ్వనాధుడిని మాత్రమే. ఎఫ్.ఎన్ సీ.సీ తరుపున నన్ను గౌరవించినందుకు గర్వంగా ఉంది. మీ ఆశీర్వచనాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా` అని అన్నారు.
కథానాయకుడు చిరంజీవి మాట్లాడుతూ, ` ఈ వేడుక నాకు చాలా ప్రత్యేకం. ఒకే వేదికపై విశ్వనాథ్ గారిని, ఎస్.పి.బి గారిని సన్మానించుకోండం చాలా సంతృప్తినిస్తుంది. ఇద్దరు సూర్య చంద్రుల్లా ఉన్నారు. అవార్డులు వాళ్లకేమి కొత్తకాదు. ఇలాంటివన్ని వాళ్లకు నూలుపోగుతో సమానం. అయినా ఎఫ్.ఎన్.సీ.సీ ఆధ్వర్యంలో సత్కరించడం అది నా చేతుల మీదుగా జరిపించినందుకు వాళ్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నా.
వాళ్లిద్దరు లెజెండరీ పర్సనాలిటీలు. వాళ్ల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఎలాంటి కళా ఖండాలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా శంకరభరణం సినిమా ఎప్పటికీ మర్చిపోలేం. తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే శంకర భరణం ముందు తర్వాత అని చెప్పుకోవాల్సిందే. అదోక మైల్ స్టోన్ మూవీ. విశ్వనాథ్ గారితో కలిసి చాలా సినిమాలు చేశాను. నాకు క్లాస్ ..మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టినవి ఆయన సినిమాలే. ఆయన నాకెప్పుటికీ పితృసమానులే. ఇంత గోప్పగా వేడుక చేసినందుకు ఎఫ్ ఎన్ సీసీ టీమ్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నా` అని అన్నారు.
గాయకుడు ఎస్. పి. బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ, ` తెలుగు సినిమాతో నాది 51 ఏళ్ల అనుబంధం. ఇన్నేళ్ల పాటు పరిశ్రమ నన్ను భరించి..ప్రేక్షకులు నన్ను ప్రేమించినందుకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో అన్నయ్య విశ్వనాథ్ గారి పక్కన కూర్చోవడం..ఆయనతో కలిసి సన్మానం అందుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. చాలా గర్వంగా ఆనందంగా ఉంది` అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియరు నటులు కైకాల సత్యన్నారాయణ, అలనాటి హీరోయిన్లు సుహాసిని, భానుప్రియ, తులసి, రోజా రమణి , కోదండ రామిరెడ్డి, సి.వి రెడ్డి, సబిత దిల్ రాజు, సతీష్ వేగేశ్న, తరుణ్ భాస్కర్, రాజ్ కందుకూరి, సి.కల్యాణ్, కొడాలి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
అలాగే ఎఫ్ ఎన్ సీసీ ప్రెసిడెంట్ కె.ఎస్ రామారవు, వైస్ ప్రెస్ డెంట్ కె. వెంకటేశ్వరరావు, సెక్రెటరీ రాజశేఖర్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ టి.రంగారావు, ట్రెజరర్ సి.హెచ్ శ్రీనివాసరాజు, కమిటీ మెంబర్లు ఆది శేషగిరిరావు, కాజా సూర్యనారాయణ, ఎ. సూర్యనారాయణరాజు, జె.రవీంద్రనాధ్, రఘునందర్ రెడ్డి, ఎన్. భాస్కర్, పరుచూరి నాగశుష్మ, శైలజ జుజాల, కె. మదన్ మోహనరావు పాల్గొన్నారు.