సినిమాగా కేర‌ళ క‌న్నీటిగాథ‌..

220
kerela floods
- Advertisement -

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కేరళ రాష్ట్రం చిగురుటాకుల వణికిపోయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో దైవ భూమి అతలాకుతలామైంది. ఈ భారీ వర్షాలు, వరదల వల్ల ఎందరో ప్రజలు నిరాశ్రయులయ్యారు. వర్షాల ధాటికి సర్వం కోల్పోయి, దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రజానికానికి అండగా తామున్నామంటూ సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు భారీ విరాళాలు ఇచ్చి వారికి ధైర్యం చెబుతూ భరోసానిచ్చారు.

kerela floods

అయితే ఈ వరదల ధాటికి కళతప్పిన కేరళ పరిస్థితిని, వర్షాలు, వరదల బీభత్సాన్ని జనానికి తెలిపేందుకు, అక్కడి పరిస్థితులను వెండితెరపై చూపించేందుకు రంగం సిద్ధమవుతోంది. కేరళలో వరద ప్రాంత స్థితిగతులను మలయాళ దర్శకుడు జూడ్‌ ఆంటోని జోసెఫ్‌ ముందుకు వచ్చాడు. కేరళలోని కొన్ని స్వచ్ఛంద సంస్థలు డాక్యుమెంటరీని తీయమని ఆయనను సంప్రదించగా, డాక్యుమెంటరీకి బదులుగా సినిమా తీస్తే బావుంటుందనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమా తీస్తున్నట్లు తెలుస్తోంది. కేరళ వరదల ప్రభావం, అప్పటి పరిస్ధితులను రాబోయే తరాల వారికి ప్రేరణనిచ్చేందుకు ఉపయోగపడుతుందని అనిపించిందని డైరెక్టర్‌ జూడ్‌ అంటోని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ పని జరుగుతుందని, ఈ సినిమాకు 2043ఫీట్‌ అనే టైటిల్‌ ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

- Advertisement -