ఉప్పొంగిన కాళేశ్వరం..పరవళ్లు తొక్కుతున్న గోదావరి

498
kaleshwaram
- Advertisement -

తెలంగాణ జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద గోదారమ్మ పరవళ్ళు తొక్కుతోంది. గోదావరిలో కలుస్తున్న ప్రాణహిత వరదనీటి ప్రవాహాంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు జలకళ వచ్చింది. 80 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహంతో గోదావరి నీరు ఉరకలెత్తుతోంది.

ఆదివారం వరకు రెండు మోటర్లతో నీటిని ఎత్తిపోసిన ఇంజినీర్లు.. సోమవారం మధ్యా హ్నం 12.09 గంటలకు మూడో నంబర్ మో టర్‌ను కూడా ప్రారంభించారు. ఒక్కోమోటర్ రోజుకు 2100 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుండటంతో కన్నెపల్లి-అన్నారం గ్రావిటీ కెనాల్ ద్వారా మూడు మోటర్ల నుంచి రోజుకు సు మారు 6,300 క్యూసెక్కుల నీరు అన్నారం బరాజ్‌కు చేరుతున్నది.

మంగళవారం(నేటి నుంచి) నాలుగో నంబర్ మోటర్‌ను ప్రారంభించనున్నారు అధికారులు. తదుపరి దశల్లో ఐదోనంబర్, రెండో నంబర్ మోటర్లను ప్రారంభించే సన్నాహాల్లో ఉన్నారు.

వర్షాలు లేకపోయినా ప్రాణహిత నుంచి వచ్చే నీటి తో గోదావరిలో సాధారణంగా 95 మీటర్ల నీరు ప్రవహించే అవకాశం ఉన్నందున కన్నెపల్లి పంపుహౌస్‌లోని ఆరు మోటర్లతో నిరంతరం పంపింగ్ నిర్వహించవచ్చని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -