ఫ్లిప్‌కార్ట్‌కు దిమ్మతిరిగింది..!

173
Flipkart to pay Rs 15000 fine
Flipkart to pay Rs 15000 fine
- Advertisement -

ఈ మధ్య కాలం లో ఎటువంటి చిన్న వస్తువు కొనాలన్నా కూడా ఆన్లైన్ లోనే బుకింగ్ చేస్తున్నారు. అయితే దీన్నే అదునుగా చేసుకొని కొన్ని రిటైలింగ్ వెబ్ సైట్ లు ప్రజలను మోసం చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాయి. తాజాగా భారతదేశ అతిపెద్ద రిటైలింగ్ సంస్ద ఫ్లిప్ కార్ట్ తన వినియోగదారులను మోసం చేసిన ఘటనలో ఫ్లిప్ కార్ట్ కు ఫైన్ పడింది. ఓ వినియోగదారుడికి నాసిరకం ఫోన్ చార్జర్ ను అమ్మినందుకు గాను అతనికి ఫ్లిప్ కార్ట్ ఆ మొత్తం జరిమానాను చెల్లించనుంది. ఈ మేరకు వినియోగదారుల ఫోరం ఫ్లిప్ కార్ట్ కు ఆదేశాలు జారీ చేసింది.

వివరాళ్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అహ్మద్ అక్ ఇర్ఫానీ రెండు నెల‌ల క్రితం ఫ్లిప్‌కార్ట్ లో రూ.259లతో ఓ స్మార్ట్‌ఫోన్ చార్జర్ ఆర్డ‌ర్ చేశాడు. అయితే, ఆ చార్జర్‌తో ఫోన్‌కు చార్జింగ్ పెట్టగానే ఫోన్ నుంచి పొగలు వచ్చాయి. అత‌డి ఫోన్ లోపలి భాగం మొత్తం షార్ట్ సర్క్యూట్ అయి కాలిపోయి ప‌నికిరాకుండా పోయింది. అయితే ఈ విషయంపై ఇర్ఫానీ ఫ్లిప్ కార్ట్ కు ఫిర్యాదు చేయగా.. ఫ్లిప్ కార్ట్‌ కేవలం ఛార్జర్‌ను మాత్రమే మారుస్తామని.. ఫోన్‌తో తమకు సంబంధం లేదని తేల్చిచెప్పింది. అయితే ఛార్జర్‌ వల్లే తన ఫోన్‌ కాలిపోయిందని ఇర్ఫాన్‌ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు.

వినియోగదారుల ఫోరంలో ఫ్లిప్ కార్ట్ ప్రతినిధులు తమ వెబ్‌ సైట్లో అమ్మే వస్తువులన్నీ నాణ్యమైనవే ఉంటాయని.. అయినా తాము సెల్లర్‌కి-బయ్యర్‌కి మధ్యవర్తిత్వం మాత్రమే వహిస్తామని వాదించారు. అయినప్పటికీ ఫోరం ఫ్లిప్ కార్ట్ వాదనతో సంతృప్తి చెందలేదు. బాధితుడికి కొత్త చార్జర్ ఇవ్వడంతోపాటు అతని ఫోన్ కు విలువైన మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. దీంతో ఫ్లిప్ కార్ట్ ఇర్ఫానీకి అతని ఫోన్ ఖరీదు రూ.15వేలను ఫైన్ గా చెల్లించింది.

- Advertisement -