కరోనా సెల్ఫ్ కిట్లు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆన్ లైన్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కొవీ సెల్ప్ కిట్ల అమ్మకాలను ప్రారంభించింది. రెండు నిమిషాల్లోనే టెస్టు పూర్తి అవడంతో పాటు 15 నిమిషాల్లోనే ఫలితాలు రానుండగా 2 నుంచి 18 సంవత్సరాల వారికి పరీక్ష చేయొచ్చు.
అయితే ఆన్ లైన్ లో కొనుగోలు చేసేటప్పుడు కనీసం రెండు ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యాంటీజెన్ కిట్ లో.. సేఫ్ స్వాబ్, టెస్ట్ కార్డ్, ప్రీఫిల్ ఎక్స్ట్రాక్షన్ ట్యూబ్, డిస్పోజబుల్ బ్యాగ్, యూజర్ మ్యానువల్ ఉంటాయి. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 24నెలలు. పూణెకు చెందిన కంపెనీ ఈ కిట్ రెడీ చేసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) దీనికి ఆమెదం కూడా తెలియజేసింది.
దేశ వ్యాప్తంగా ఉన్న ఏడు లక్షల ఆన్ లైన్ ఫార్మసీల్లో ఈ కిట్ దొరుకుతుందని 90శాతం ప్రాంతాలకు ఈ కిట్ చేరుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మైలాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ డైరక్టర్ సుజీత్ జైన్ చెప్పారు.