ఫ్లిప్ కార్ట్….భారీ డిస్కౌంట్లు

186
flipkart
- Advertisement -

ఫ్లిప్ కార్ట్ మరోసారి భారీ ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ముందుకొచ్చింది. షాప్‌ ఫ్రమ్‌ హోమ్‌ డేస్‌ సేల్‌ పేరుతో ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వ‌ర‌కు ఈ సేల్ అందుబాటులో ఉండ‌నుంది. ఈ సేల్‌లో ఎల‌క్ట్రానిక్ గూడ్స్‌పై భారీ డిస్కౌంట్లు ఉండ‌గా.. ఇదే స‌మ‌యంలో 10 శాతం ఇన్‌స్టాండ్ డిస్కౌంట్ కూడా ల‌భించ‌నుంది.

ఇక‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రిడెట్ కార్డుపై కొనుగులో చేస్తే అద‌నంగా మ‌రో 10 శాతం ధ‌ర త‌గ్గనుంది. ఆర్‌వోజీ ఫోన్ 3 మోడ‌ల్‌లో 8+128 జీబీ వేరియంట్‌పై క‌స్ట‌మ‌ర్లు రూ.5000 వేలు డిస్కౌంట్ పొందే అవ‌కాశం ఉండ‌గా.. 12 + 128 జీబీ వేరియంట్‌పై రూ. 4,000 త‌గ్గింపు ఉంటుంది.

ఆసుస్ గ‌త ఏడాది ROG ఫోన్ 3ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6.59 అంగుళాల డిస్‌ప్లేతో 2340×1080 పిక్స‌ల్ రిజల్యూషన్, క్వాల్కమ్ స్నాప్ ‌డ్రాగన్ 865 ప్లస్ 5 జి ప్రాసెసర్‌తో 12 జీబీ వ‌ర‌కు ర్యామ్, 128 జీవీ వ‌ర‌కు ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ ఉంది.. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 64 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 13 ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్ మరియు 5 ఎంపీ మాక్రో కెమెరా ఉన్నాయి. అలాగే వివిధ రకాల మొబైల్‌, టాబ్లెట్‌, స్మార్ట్‌వాచ్‌, స్మార్ట్‌టీవీ,రిఫ్రిజిరేటర్, దుస్తులు, బూట్లు, కిరాణా సామాను, ఫర్నిచర్‌, ఇతర వస్తువులపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి.

- Advertisement -