ఓ ప్యాసింజర్ మాస్క్ ధరించేందుకు నిరాకరించడంతో ఏకంగా ఫ్లైట్‌నే వెనక్కి మళ్లించాడు పైలట్. అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 129 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బందితో దాదాపు గంటన్నర పాటు ప్రయాణించిన విమానం తిరిగి ఎక్కడి నుండి ప్రారంభమైందో అక్కడికే చేరింది.
బుధవారం నాడు అమెరికాలోని మియామీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ కు బయలుదేరింది. అయితే విమానంలో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికురాలు మాస్క్ ధరించేందకు నిరాకరించడంతో టేక్ ఆఫ్ అయిన గంటన్నర వ్యవధిలోనే విమానాన్ని వెనక్కు మళ్లిస్తున్నట్లు పైలట్ ప్రకటించారు.విమానం మియామీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోగానే అక్కడి అధికారులు సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆ మహిళ చేసిన పనికి సర్వీస్‌ను రద్దు చేసిన విమాన సంస్థ టికెట్ బుక్ చేసుకున్న(లండన్ – మియామీ) ప్రయాణికులకు డబ్బులు తిరిగి చెల్లించింది.