- Advertisement -
ఐపీఎల్ 2025 ఆసక్తికరంగా సాగుతోంది. అయితే భారీ స్కోర్ లేదా లోయెస్ట్ స్కోర్. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్(RR)పై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. జైపూర్‌లో ఏప్రిల్ 19న లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్‌లో ఫిక్సింగ్ కారణంగా రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయారని ఆరోపించారు రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (RCA) కన్వీనర్ జైదీప్ బిహానీ.
హోమ్ గ్రౌండ్‌లో గెలుపు ఖాయం అనుకున్న సమయంలో ఓడిపోవడం అనేక అనుమానాలకు దారితీస్తుందని, ఈ మ్యాచ్‌పై వెంటనే దర్యాప్తు చేయాలని కోరిన జైదీప్ బిహానీ కోరారు. దీంతో మరోసారి ఫిక్సింగ్ భూతం వెలుగులోకి రాగా అంతా షాక్‌కు గురయ్యారు.
Also Read:కేంద్రమంత్రులతో చంద్రబాబు భేటి..
- Advertisement -

