సార్వత్రిక సమ్మెకు టీఆర్ఎస్ సంఘీభావం..

193
vinod kumar
- Advertisement -

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ, కార్మిక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్నసార్వత్రిక సమ్మెకు టీఆర్ఎస్ తరఫున సంఘీభావం తెలుపుతున్నానని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ ప్రకటించారు. గురువారం టీఆర్ఎస్ తరపున ఆయన సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నాను. ఇందులో భాగాంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద రైల్వే కార్మికుల ధర్నాలో, ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో మహా ధర్నాలో, బ్యాంకు స్ట్రీట్‌లోని సెంట్రల్ బ్యాంకు ప్రాంగణంలో బ్యాంకు అధికారుల సమ్మె , నిరసనలో వినోద్‌ కుమార్‌ పాల్గొన్నారు.

సార్వత్రిక సమ్మెకు టీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు ఇస్తున్నదని ప్రకటించారు. బుధవారం సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులతో ఆయన భేటీ అయ్యారు. లాభాల బాటలో నడుస్తున్న ఎల్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్‌,రైల్వే, హెచ్‌ఏఎల్‌ వంటి అనేక సంస్థలను నట్టేట ముంచుతున్న మోదీ సర్కారు చర్యలను ప్రజల్లో ఎండగట్టాలని నిర్ణయించారు. కార్మికలోకమంతా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని వినోద్‌కుమార్‌ పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ నేతలు వీరయ్య, వెంకటేశ్‌,భాస్కర్‌,ఏఐటీయూసీ నాయకులు నరసింహన్‌, బోస్‌, నర్సింహ, బాలరాజు, టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్‌, ఇంచార్జి రూప్‌సింగ్‌, రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ నాయకుడు యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -