రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి…

142
ktr
- Advertisement -

రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాకు వెళ్లిన మంత్రి కేటీఆర్‌…సత్ఫలితాలను సాధిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి మరో కంపెనీ ముందుకు వచ్చింది. దాదాపు రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఫిష్‌ఇన్‌ కంపెనీ వెల్లడించింది.

మంత్రి కేటీఆర్‌తో సమావేశం అనంతరం కంపెనీ ఈ మేరకు ప్రకటించింది. ఇంటిగ్రేటెడ్‌ ఫ్రెస్‌ వాటర్‌ ఫిష్‌ కల్చర్‌ను అభివృద్ధి చేయనుంది. దీంతో ఐదు వేల మందికి ఉపాధి లభించనుంది.

కాగా, మెడికల్‌ డివైసెస్‌ తయారీ కంపెనీ అయిన కన్‌ఫ్లోయాంట్‌ త్వరలో హైదరాబాద్‌లో యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. మొదట పైలట్‌ పద్ధతిలో యూనిట్‌ను ఏర్పాటు చేసి, క్రమంగా 12 నెలల్లో కంపెనీని విస్తరించనున్నట్లు సంస్థ ప్రకటించింది.

రాష్ట్రంలో భారీ పెట్టుబడిని పెట్టనున్న ఫిష్ ఇన్ కంపెనీకి ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ పెట్టుబడి తో తెలంగాణ రాష్ట్రంలో మత్స్య పరిశ్రమకి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నైపుణ్యం అంది వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అధికంగా ఉన్న తెలంగాణ యువతకు ముఖ్యంగా మత్స్య పరిశ్రమపై ఆధారపడిన వారికి, మిడ్ మానేరు నిర్వాసితులకు ప్రాధాన్యత ఇవ్వాలని కంపెనీకి సూచించారు.

- Advertisement -