దీప్‌వీర్‌…పెళ్లి ఫోటోలు

312
deepika ranveer
- Advertisement -

బాలీవుడ్ ప్రేమ పక్షులు దీపికా పదుకొణే-రణవీర్‌ సింగ్ ఒక్కటైన సంగతి తెలిసిందే. తొలుత దీపికా పదుకొణే తరపు కొంకణి సంప్రదాయం ప్రకారం చిత్రపుర్ సరస్వత్ పద్దతిలో వివాహం జరిగింది. వేద మంత్రాలు,మంగళవాద్యాలు,అతిథుల ఆశీర్వాదాల మధ్య వీరి పెళ్లి ఇటలీలో జరుగగా అతిథులందరూ తెలుపు రంగు దుస్తుల్లో మెరిశారు.

తాజాగా రెండోసారి దీప్‌వీర్ పెళ్లి జరిగింది. రణవీర్ కుటుంబ సంప్రదాయం ప్రకారం సింధీ సంప్రదాయంలో గ్రాండ్‌గా జరిగింది.పెండ్లి జరిగినా ఫోటోలు విడుదల చేయక పోవడంతో అభిమానులు ఆత్రుతగా ఎదురుచూశారు. ఏకంగా కేంద్ర మంత్రి సృతి ఇరాని కూడా ఫన్నీ ట్వీట్ చేశారు. రణ్ దీప్ పెండ్లి ఫొటోల కోసం ఎదురు చూసి ఎదురు చూసి ఓ వ్యక్తి అస్తిపంజరం అయ్యాడని సరదాగా ట్వీట్ చేశారు. దీంతో స్పందించిన రణ్ దీప్ దంపతులు తమ పెండ్లి ఫొటోలను విడుదల చేశారు.

కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలకు 30 మంది అతిథులను మాత్రమే హాజరయ్యారు. సినీ రంగం నుండి దర్శక దిగ్గజం సంజయ్ లీలా బన్సాలీ తో పాటు ఫరా ఖాన్ హజరు అయ్యారు.

- Advertisement -