అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి. మూడో సూపర్ ఓవర్‌లో తేలింది ఫలితం. మొదట బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన నేపాల్ జట్టు ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది.అయితే మ్యాచ్ నేపాల్ గెలుస్తుందనుకున్న తరుణంలో నందన్ యాదవ్ అద్భుత పోరాటం చేశాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఫలితం తేలడం కోసం మొదటి సూపర్ ఓవర్ నిర్వహించారు. అయితే ఇరు జట్లు 19 పరుగుల చేయడంతో టైగా ముగిసింది. రెండో సూపర్ ఓవర్ లో ఇరు జట్లు 17 పరుగులు చేయడంతో ఇది కూడా టైగా ముగిసింది.
ఇక మూడో సూపర్ ఓవర్‌లో నెదర్లాండ్స్ ఆల్‌రౌండర్ జాచ్ లయన్-కాచెట్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నేపాల్ జట్టుకు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా, కేవలం నాలుగు బంతుల్లో రెండు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థిని పూర్తిగా నిలువరించాడు. అనంతరం నెదర్లాండ్ బ్యాట్స్‌మెన్ మొదటి బంతికే సిక్స్ బాదడంతో విజయం సాధించింది.
Also Read:Dhee2పై మంచు విష్ణు!

