Dhee2పై మంచు విష్ణు!

8
- Advertisement -

విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప విడుదలకు సన్నద్ధమవుతున్నారు. ఈ భక్తిరస ఫ్యాంటసీ ఎంటర్‌టైనర్‌లో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, కాజల్ అగర్వాల్ కీ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 27న ఈ సినిమా విడుదల కానుండగా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు విష్ణు.

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… Dhee 2 సీక్వెల్ గురించి స్పందించారు. కన్నప్ప తర్వాత ఎలాంటి ప్రాజెక్టుల గురించి నేను ఇంకా ఆలోచించలేదు. 1947 నేపథ్యంలోని ఒక పీరియడ్ ఫిల్మ్‌ను తీసే ఆలోచనలో ఉన్నాం. ప్రస్తుతం నా దృష్టంతా కన్నప్పపైనే ఉంది అన్నారు. Dhee 2 విషయంలో అయితే, డైరెక్టర్‌ మరియు నేను కలిసి ప్రయత్నిస్తున్నాం… స్క్రిప్ట్ రెడీ అయితే వెంటనే చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని తెలిపారు.

Dhee 2 ఇంకా ప్రిపరేషన్‌లో ఉందని విష్ణు స్పష్టం చేశారు. స్క్రిప్ట్ ఫైనల్ అయిన వెంటనే షూటింగ్ మొదలుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.

Also Read:ఈ చిన్నారిని కాపాడుకుందాం: కేటీఆర్

- Advertisement -