Bihar:20 ఏళ్ల తర్వాత తొలిసారి పొలింగ్!

9
- Advertisement -

బీహార్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల్లో 20 ఏళ్ల తర్వాత ఓటేసారి ఆ ప్రాంత ప్రజలు. ముంగేర్ జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత భీంబంధ్ ప్రాంత ప్రజలు 20 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటు వేశారు. భద్రతా కారణాల వల్ల గత రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో పోలింగ్ జరగలేదు.

ప్రభుత్వ అధికారులు మరియు స్థానికులు, ఈ ప్రాంతంలో పోలింగ్ కేంద్రం తిరిగి ఏర్పాటు కావడం వలన చాలా కాలంగా ఎదురుచూస్తున్న అభివృద్ధి త్వరలో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. 20 ఏళ్ల తర్వాత ఇక్కడ ఓటు వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. 2005 తర్వాత పరిస్థితి అనుకూలంగా లేకపోయింది అన్నారు. ఇప్పుడు ఎటువంటి భయం లేదు…. భద్రతా దళాల శిబిరం ఏర్పడినప్పటి నుంచి మేము ప్రశాంతంగా జీవిస్తున్నాం అని తెలిపారు. ప్రభుత్వ సౌకర్యాలు కూడా బాగున్నాయి. కొన్నేళ్లుగా ఉచిత రేషన్ కూడా అందుతోంది. మాకు ఇప్పుడు ఎటువంటి సమస్యలు లేవు. అడవిలో ప్రశాంతంగా జీవిస్తున్నాం. పో

ఇక్కడ తొలిసారి ఓటు వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను 18 ఏళ్లు పూర్తయినా ఓటు వేయలేకపోయాను, ఎందుకంటే ఓటు వేయాలంటే అడవిని దాటాల్సి వచ్చేది. అది ప్రమాదకరం. కానీ ఇప్పుడు ప్రభుత్వం సదుపాయం కల్పించింది, మేము ఇక్కడే ఓటు వేయగలిగాం అని మరో గ్రామస్తుడు తెలిపారు.

Also Read:ఎన్నికలు రాగానే ఎన్టీఆర్ గుర్తుకొచ్చారా?

ఇది బూత్ నం. 310. ఇక్కడ 20 ఏళ్ల తర్వాత ఓటింగ్ జరుగుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ప్రతికూల సంఘటన కారణంగా ఇక్కడ ఓటింగ్ ఆగిపోయింది. మేము ఈ ప్రాంతాన్ని సందర్శించి ప్రజలకు భయపడకుండా వచ్చి ఓటు వేయమని హామీ ఇచ్చాం…ప్రజల్లో ఓటింగ్‌పై అవగాహన కల్పించాం అని ఎన్నికల అధికారులు తెలిపారు.

- Advertisement -