తొలి వ్యాక్సిన్ ప్రధాని వేయించుకోవాలి!

33
bihar

దేశంలో అత్యవసర వినియోగానికి రెండు టీకాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యాక్సిన్‌కు ఏర్పాట్లు చేస్తుండగా బీహార్‌కు చెందిన కాంగ్రెస్ నేత అజిత్‌ శర్మ వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

కరోనా వ్యాక్సిన్ సుర‌క్షిత‌మా.. క‌దా..? అనే విష‌యంలో అనుమానాలు తలెత్తుతున్నాయని తెలిపిన అజిత్ శర్మ…తొలి టీకా ప్రధాని నరేంద్ర మోదీ వేయించుకోవాలన్నారు. రష్యా, అమెరికా దేశాధినేతలు ఏవిధంగానైతే తమ దేశంలో తొలి వ్యాక్సిన్‌ను తామే వేయించుకున్నారో.. అదేవిధంగా మన దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ టీకా వేయించుకోవాలన్నారు.

అప్పుడే ప్రజలకు దానిపై నమ్మకం కుదురుతుందన్నారు. నూతన సంవత్సరం ఆరంభంలోనే వ్యాక్సిన్ రావడం ఆనందదాయకమని, అయితే వ్యాక్సిన్‌ రక్షణపై చాలామందిలో అనుమానాలున్నాయని చెప్పారు.