గ్రేటర్‌లో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్..

143
Drunk-and-Drive
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. కరోనా లాక్ డౌన్ తర్వాత వీకెండ్‌లో సైబరాబాద్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా ఇకపై మరింత కఠినంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు.

గత వారం రోజుల్లో 3571 మందిపై కేసులు నమోదుచేశామని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదుచేశామని.. వాహనాలు స్వాధీనం చేసుకుని పోలీస్‌ స్టేషన్లకు తరలిస్తున్నామని చెప్పారు. మద్యం సేవించి వాహనం నడిపిన వారిలో ద్విచక్రవాహనదారులే ఎక్కువగా ఉన్నారని వెల్లడించారు. ఆదివారం నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో 346 మంది పట్టుబడ్డారని పోలీసులు చెప్పారు.

- Advertisement -