తమిళ సినీ ఇండస్ట్రీలో హీరోలుగా మంచి క్రేజ్‌ను దక్కించుకున్న హీరోలు మాధవన్, విజయ్ సేతపతి. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో మల్టీస్టారర్ మూవీ రాబోతుంది. లవర్ బోయ్ ఇమేజ్ నుంచి బయటపడ్డ మాధవన్ నటనకు ఆస్కారమున్న చిత్రాల్లో నటించి ప్రశంసలందుకున్నారు. చాలా కాలం తర్వాత మాధవన్ నటించిన ఇరుధి సుట్రు చిత్రం విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకోగా బాక్సర్‌గా ఈ మూవీలో మాధవన్ అద్భుతంగా నటించాడు. దీంతో మాధవన్‌కు మళ్లీ అవకాశాలు పెరిగాయి.
తాజాగా మాధవన్ ధాన పాత్రలో విక్రమ్ వేద అనే మూవీ తెరకెక్కుతుంది. పుష్కర్-గాయత్రి తెరకెక్కిస్తున్న విక్రమ్ వేద మూవీలో మాధవన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్( ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్) పాత్రని పోషిస్తుండగా, ప్రతి నాయకుడి పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నాడు. గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్న విజయ్ సేతుపతి సినిమాలో మాధవన్ తో తలపడనున్నాడట. ఇంక ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో మాధవన్, విజయ్ సేతుపతిల లుక్ స్టన్నింగ్‌గా ఉంది. ఫస్టు లుక్‌తో సినిమాపై అంచనాలు పెంచేశారు. ఇక ఈ సినిమా కోసం భారీగా బరువు కూడా తగ్గిన సంగతి తెలిసిందే. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విక్రమ్ వేదతో మాధవన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.