అమల ఇక ఫ్రీ బర్డ్

218
Amala - Vijay granted divorce
- Advertisement -

మళయాలం బ్యూటీ అమలా పాల్ సినిమాల ద్వారా ఎంత పాపులారిటీ సంపాదించుకున్నారో వ్యక్తిగత విషయాలు, వివాదాలతోనూ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. తమిళ దర్శకుడు ఎఎల్.విజయ్‌తో ప్రేమాయణం, ఇంట్లో వారిని ఎదిరించి అతన్ని పెళ్లి చేసుకోవడం… సంవత్సరం తిరిగేలోపు విడాకులు, తర్వాత పలు వివాదాలు ఇలా ఎప్పుడూ వార్తలో నానుతునే ఉంది. ప్రస్తుతం అమల విడాకుల కేసు కోర్టు బోనులో ఉంది.

2014లో విజయ్‌ని  క్రిస్టియన్ వెడ్డింగ్.. ఇటు హిందూ సంప్రదాయం ప్రకారం  పెళ్లి చేసుకుంది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న తరువాత దాదాపు సినిమాలకు స్వస్తి చెప్పాలని అనుకుంది అమల. ఇంతలో ఏమైందో తెలియదు కాని..  ఆ తరువాత తిరిగి నటించాలని ఫిక్సయ్యింది. దీంతో కుటుంబంలో గొడవలు పెరిగి చివరికి డైవర్స్‌కు దారితీయగా  ఆ టెన్షన్‌ను పెద్దగా పట్టించుకోని ఈ బ్యూటీ తన కెరీర్‌పై దృష్టి సారించింది.

సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఫ్రీ బర్డ్‌ గా మిగిలింది. విజయ్- అమలాపాల్‌కు విడాకులు మంజూరు చేస్తు కోర్టు తీర్పు వెలువరించింది. ఇప్పటికే అమల ఒక అరడజను సినిమాల్లో నటిస్తూ ఉండగా.. ఇప్పుడు ఫ్రీ బర్డ్ అయిపోయింది కాబట్టి ఇంకాసినన్ని సినిమాలు సైన్ చేస్తుందేమో చూడాలి.

- Advertisement -