బిల్‌ క్లింటన్‌.. జెంటిల్మ్యానా..? మాజీ అధ్యక్షుడా..?

205
Online News Portal
First gentleman? Mr President?
- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రచార ఘట్టం పరిసమాప్తమైంది. ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక అమెరికా వైట్‌ హౌస్‌లో ఇప్పటివరకు మహిళ అధ్యక్ష పీఠం చేపట్టలేదు. అధ్యక్ష పదవికి పోటీపడుతున్న అభ్యర్థులు ఇద్దరూ పోటాపోటీగా ప్రచారం నిర్వహించడంతో గెలుపుపై ఉత్కంఠ నెలకొంది. పలు సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ఆధిక్యం ఇద్దరి మధ్య దోబూచులాడడంతో చివరి వరకు ఎన్నికలు ఉత్కంఠగా మారాయి.

ఈమెయిల్ వివాదంలో ఎన్నికలకు ఒక్కరోజు ముందు హిల్లరీకి ఎఫ్‌బీఐ క్లీన్ చిట్ ఇవ్వడంతో కాస్త వెనకబడిన ఆమె మళ్లీ దూసుకెళ్తున్నారు. సర్వేలు కూడా హిల్లరీనే అమెరికా అధ్యక్షురాలని స్పష్టం చేస్తున్నాయి. దీంతో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలిస్తే.. ఆమె భర్త బిల్ క్లింటన్ ఏమని పిలవాలా అన్న ప్రశ్న ప్రస్తుతం అమెరికన్లను వెంటాడుతోంది. . హిల్లరీ గెలుపుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుండటంతో, తొలి మహిళా అధ్యక్షురాలి జీవిత భాగస్వామిగా బిల్ క్లింటన్ వైట్హోస్కు రానున్నారు. అంతేకాక బిల్ క్లింటన్ ఇంతకముందే అమెరికాకు అధ్యక్షుడిగా పనిచేయడంతో, వైట్హోస్కు రాబోతున్న తొలి మాజీ అధ్యక్షుడు కూడా ఇతనే కానుండటం గమనార్హం. దీంతో బిల్ క్లింటన్ను మిస్టర్ ప్రెసిడెంట్ అని పిలవాలా? ఫస్ట్ జెంటిల్మ్యాన్ అని పిలవాలా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

hillarybillear

అమెరికాలో ఆరుగురు మహిళా గవర్నర్లు ఉన్నారని, వారి భర్తలను అనధికారికంగా మొదటి జెంటిల్మ్యాన్గా పిలుస్తున్నారని చెప్పారు. కానీ అధ్యక్షురాలి భర్తలకు ఎలాంటి నిబంధనలు లేవని తెలిపారు. అధ్యక్షురాలికి భాగస్వామిగా రాబోతున్న వారికి స్టేట్ లెవల్లో ఏమని అడ్రస్ చేయాలా అని సందిగ్ధత ఏర్పడిందని, ఇప్పటివరకు పురుష అధ్యక్ష భాగస్వామికి ఎలాంటి రోడ్ మ్యాప్ లేదని ఎవరికి తోచిన విధంగా వారు సలహాలు ఇస్తున్నారు. ఒక్కసారి ప్రెసిడెంట్ అయితే, ఆయన జీవితాంతం అధ్యక్షుడిగానే గుర్తింపు పొందుతారని పేర్కొంటున్నారు. ఒకవేళ హిల్లరీ అధ్యక్షుడిని పెళ్లి చేసుకుని ఉండకపోతే, ఆయన్ని మొదటి జెంటిల్మ్యాన్గానే పిలువబడేవాడని…కానీ అంతకమున్నుపే బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా పనిచేయడంతో, ఆయన మాజీ అధ్యక్షుడిగానే పరిగణించబడతారని కొందరు అంటున్నారు.

- Advertisement -