న్యూజిలాండ్- శ్రీలంకల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలిసారి మహిళా అంపైర్‌గా న్యూజిలాండ్‌కు చెందిన కిమ్ కాటన్ నిలిచింది. డునెడిన్‌లో జరుగుతున్న రెండవ టీ20 మ్యాచ్ ద్వారా ఈ ఘనత సాధించింది. మహిళల క్రికెట్‌లో అనుభవం కలిగిన కాటన్ 2018 నుండి ఇప్పటివరకు 54మహిళల టీ20లు, మరియు 24 మహిళల ఓడీఐలలో టీవీ అంపైర్‌గాను, ఆన్-ఫీల్డ్ గా వ్యవహరించారు. కాగా ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచి మూడు గేమ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
అంతేకాదు అసోసియేట్ దేశాలకు చెందిన ఒమన్ మరియు నమీబియా ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన క్లైర్‌పోలోసాక్ అంపైర్‌గా పనిచేశారు. ఈమె 2022లో సిడ్నీలో జరిగిన భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఫోర్త్ అంపైర్‌గా పనిచేశారు.
Kim Cotton creates history, first female to umpire in men's international match featuring full-member countries
Read @ANI Story | https://t.co/JFYR1rpY8c#KimCotton #cricket #ICC #NZvsSL pic.twitter.com/IOmIW2a3zn
— ANI Digital (@ani_digital) April 5, 2023
ఇవి కూడా చదవండి…