2022…హిందీలో మొదటి రోజు కలెక్షన్లు

25
- Advertisement -

2022వ సంవత్సరం నుంచి వేల చిన్న పెద్ద సినిమాలు వచ్చిన వాటిలో మాత్రమే ది బెస్ట్‌ సినిమాలుగా కొన్ని మాత్రమే మిగిలాయి. వాటిలో మరి ముఖ్యంగా మొదటి రోజు కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్‌ సినిమాల కంటే సౌత్ సినిమాల హావా ఎక్కువగా సాగింది. సౌత్‌ నుంచి వచ్చిన కేజీఎఫ్‌2 ఆర్ఆర్ఆర్‌ కాంతారా లాంటి సినిమాలు హిందీ బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్‌ సినిమాలు నిలబడలేకపోయాయి. కానీ కథాపరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలు మాత్రము తొలిరోజు కలెక్షన్లు రికార్డు స్థాయిలో వసూలు చేయసాగాయి. వాటిలో కొన్ని…

కేజీఎఫ్ 2
రాకింగ్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ 2 సినిమా హిందీ వసూల్లో మొదటి స్థానంలో నిలిచింది. విడుదలైన మొదటి రోజు హిందీలో సూమారుగా రూ.54కోట్లను దాటింది. గతంలో సౌత్ సినిమాలు ఇంత రికార్డు సృష్టించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా భారీ ఘన విజయంను సాధించింది. హిందీ మార్కెట్‌లో ఈ సినిమా రూ.434కోట్లను సాధించింది.

బ్రహ్మాస్త్రం
బాలీవుడ్‌లో అత్యంత ఖరీదైన సినిమాగా నిలిచింది. విడుదలైన మొదటి రోజు ఈ సినిమా రూ.36కోట్లను సాధించింది. ఇందులో రణ్‌బీర్ కపూర్ ఆలియా భట్ అమితాబ్‌బచ్చన్ నాగార్జున మౌనీరాయ్ లాంటి హెమాహెమీలు నటించారు. ఇది ఓవర్‌ఆల్‌గా హిందీలో రూ.257కోట్లను అందుకుంది.

ఆర్ఆర్ఆర్
బాహబలి స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్‌ రాజమౌళి నుండి వచ్చిన సినిమా ఆర్‌ఆర్ఆర్‌. జూ.ఎన్టీఆర్‌ రామ్ చరణ్ అజయ్ దేవ్‌గన్ ఆలియా భట్ శ్రియ ప్రధానపాత్రలో పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపించింది. విడుదలైన మొదటి రోజుల దాదాపు రూ.20కోట్లు వసూలు చేసింది. మొత్తమీద దాదాపుగా హిందీలో రూ.274కోట్లను సాధించింది.

దృశ్యం2
అజయ్ దేవగన్ శ్రియ ప్రధాన పాత్రలో నటిస్తున్న దృశ్యం2 సినిమా విడుదలైన మొదటి రోజున రూ.15కోట్ల కలెక్షన్లను దాటింది. ఈ సినిమాపై అంచానాలకుమించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు సాధిస్తుంది. దృశ్యం2 ఇంకా థియేటర్లలో రన్‌ అవుతుండగా రూ.200కోట్ల మార్క్‌ని క్రాస్ చేసింది.

భూల్‌భూలయ్యా2
కార్తీక్ ఆర్యన్ నటించిన భూల్ భూలయ్యా సినిమా హిందీ మార్కెట్‌లో విడుదలైన మొదటి రోజున రూ.14.11కోట్లను వసూలను సాధించింది. కరోనా తర్వాత ఈసినిమా భారీ విజయంను సాధించిన తర్వాత కాలంలో వచ్చిన సినిమాలు పెద్దగా ఆడలేక పోయాయి. రూ.250కోట్లను ప్రపంచవ్యాప్తంగా సాధించగా… హిందీలో మార్కెట్‌లో 70కోట్లను వసూలు చేసింది.

కాశ్మీర్‌ఫైల్స్
కాశ్మీర్ పండిట్ల నేపథ్యంలో 1990లనాటి నేపథ్యంలో కాశ్మీర్‌ పండిట్ల ఊచకోతపై వచ్చిన సినిమా. కాశ్మీర్ ఫైల్స్ ను వివేక్ రంజన్ అగ్నహోత్రి కళ్లకు కట్టినట్టుగా తెరకెక్కించారు. ఈ సినిమా ద్వారా కోట్లాది మంది భారతీయులను గుండెలను తాకింది. దాదాపు రూ. 1 కోటి లతో నిర్మితమైన ఈ సినిమా మొదటి రోజు సూమారుగా రూ.3కోట్ల వసూలను సాధించింది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.252కోట్ల వసూలను సాధించింది.

రోహిత్‌శెట్టి దర్శకత్వంలో వస్తున్న సర్కస్ సినిమా క్రిస్టమస్ కానుకగా విడుదల కానుంది. రణ్‌వీర్ సింగ్ డ్యూయెల్ రోల్‌ నటిస్తుండగా పూజా హెగ్డే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ జోడిగా నటిస్తున్నారు. మొదటి రోజు హిందీ మార్కెట్‌లో ఎంత కలెక్షన్‌ను సాధిస్తుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి…

పూజా హెగ్డే 7 కోట్లు అడుగుతుంది

గణితవేత్తల జీవితాధారంగా సినిమాలు…

సందీప్ తో రెజీనా డేటింగ్ ?.. కాకపుట్టిస్తోన్న ఫోటో

- Advertisement -