ఏపీలో తొలి కోవిడ్ కేసు నమోదు!

5
- Advertisement -

ఏపీలో తొలి కోవిడ్ కేసు నమోదు అయింది. విశాఖ – పిఠాపురం కాలనీలో ఓ మహిళకు కొవిడ్‌ పాజిటివ్ సోకింది. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కాస్త అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో సూచించారు.

మద్దిలపాలెంకు చెందిన ఓ వివాహితకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోండగా ఆమెతో పాటు భర్త, పిల్లలకు RTPCR పరీక్షలు చేశారు వైద్యులు. వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లోనే ఉండాలని సూచించారు వైద్యులు.

చుట్టుపక్కల వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని తెలిపింది ఆరోగ్య శాఖ. ప్రజలందరూ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని… ప్రస్తుతం సీజన్ మారడంతో జలుబు, దగ్గు, జ్వరాల నేపథ్యంలో ఇది సర్వసాధారణమే అంటున్నారు వైద్యులు.

Also Read:తిరుమల..దర్శన టికెట్ల అప్‌డేట్

- Advertisement -