అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

4
- Advertisement -

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనలో నలుగురు భారత సంతతి వ్యక్తులు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. కుటుంబ తగాదాలే ఈ ఘోరానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

సమాచారం ప్రకారం, భార్యతో పాటు ఇతర బంధువులతో ఏర్పడిన వివాదం నేపథ్యంలో భర్త తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఉన్న ముగ్గురు చిన్నపిల్లలు తీవ్ర భయాందోళనకు గురై ఒక గదిలో దాక్కుని ప్రాణాలతో బయటపడ్డారు.

కాల్పుల శబ్దాలు విన్న వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటిని చుట్టుముట్టి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని 51 ఏళ్ల విజయ్ కుమార్‌గా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, కుటుంబ నేపథ్యం, వివాదాలపై లోతైన విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

Also Read:GHMC విభజనకు కౌంట్‌డౌన్ స్టార్ట్

అమెరికాలో గన్ హింస ఘటనలు తరచుగా జరుగుతుండటంపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషాద ఘటనపై భారతీయ సమాజం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

- Advertisement -