అమెరికాలోని టెక్సాస్‌లో కాల్పుల కలకలం

3
- Advertisement -

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో కాల్పుల కలకలం రేగింది. ఆస్టిన్ నగరంలోని ఓ బార్‌లో గుర్తు తెలియని వ్యక్తి అకస్మాత్తుగా కాల్పులు జరపడంతో భయానక పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను ఖాళీ చేయించారు. అనుమానిత సాయుధుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నిందితుడు మృతి చెందాడు.

Also Read:బుర్జ్ ఖలీఫా భవనానికి మంటలు

ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనతో స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -