అమెరికాలో కాల్పుల కలకలం..

6
- Advertisement -

అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఉటా రాష్ట్రంలోని సెంటెనియల్‌ పార్క్‌ లో కాల్పులు లజరుగగా ఎనిమిది నెలల చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ ఇద్దరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సెంటెనియల్‌ పార్క్‌లో జరుగుతున్న వెస్ట్‌ఫెస్ట్‌లో కాల్పులు జరిగాయి అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 8 నెలల చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. మరో ఇద్దరు గాయపడినట్లు వెల్లడించింది.

Also Read:జనగణన.. నోటిఫికేషన్ జారీ

- Advertisement -