స్టార్‌ హీరోల మధ్య.. విజయ్‌ దేవరకొండ చిచ్చు..?

284
- Advertisement -

‘గీత గోవిందం’ మూవీతో ఫుల్‌ జోష్‌ మీదున్న విజయ్‌ దేవరకొండ ఇప్పుడు ఇద్దరు స్టార్‌ హీరోల మధ్య చిచ్చుపెట్టినంత పని చేశాడు. ప్రిన్స్‌ మహేష్ బాబు లేటెస్ట్‌ మూవీ ‘మహర్షి’ షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ లో జరుగుతోంది. అయితే ఈ సినిమా సెట్‌ కి విజయ్‌ దేవరకొండ వెళ్ళాడు. అక్కడ దర్శకుడు వంశీ పైడిపల్లి, మహేశ్‌ని కలిశాడు. అంతటిపో ఆగకుండా..తన ఆనందాన్ని ట్విట్టర్‌ద్వారా ఫ్యాన్స్‌ తో పంచుకున్నాడు ఈ యంగ్‌ హీరో. ‘‘మహేశ్‌గారి సినిమా టికెట్స్‌ గురించి ఫైటింగ్‌ చేసే రోజుల నుంచి ఆయనతో కలిసి సెట్‌లో కాసేపు నటన గురించి రోజు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది’’ అని విజయ్‌ దేవరకొండ పేర్కొన్నారు.

Mahesh Babu and  vijay devarakonda,

విజయ్ ట్వీట్‌పై మహేశ్‌ స్పందిస్తూ…‘‘నాకు కూడా అదే అనుభూతి కలిగింది. సమయం సరదాగా గడిచింది. నువ్వు హాలిడే ఎంజాయ్‌ చేయవలసిన సమయం వచ్చింది’’ అన్నారు. అంతే…మహాష్‌ రిప్లే పై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. మహేష్ బర్త్ డేకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషెస్ చెబితే ఆయన రియాక్ట్‌ అవలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘నిన్ను ట్యాగ్ కూడా చెయ్యలేదు.. అయినా రిప్లై ఇచ్చావ్’అని మహేష్ ఇచ్చిన రిప్లైపై ఓ నెటిజన్ కామెంట్‌ పెడితే..మరో నెటిజన్ ‘ట్యాగ్ చేసే తారక్‌కి మాత్రం ఇవ్వడు’ అని కామెంట్ పెట్టాడు. అంతటితో ఆగకుండా..మరొకరు ‘కొంచెం టిపికల్ ఆయన’ అని కామెంట్ పెడితే.. ఇంకొకరు ‘ఏం టిపికలో ఏంటో… పాపం అన్నా అన్న తారక్‌కి రిప్లై ఇవ్వకపోతే మనకే ఇలా ఉంటే వాళ్ల ఫ్యాన్స్‌కి ఎలా ఉంటాది?’అని కామెంట్ పెట్టారు. ఇక ఇదంతా.. సోషల్ మీడియాలో నెటిజన్లు చేస్తున్న కామెంట్లే.. మొత్తానికి ఈ కామెంట్ల కథకి ఎవరు పుల్ స్టాప్‌ పెడతారో చూడాలి.

- Advertisement -