షాకింగ్..న్యాయమూర్తి ఇంటిలో నోట్ల కట్టలు!

1
- Advertisement -

ఢిల్లీ న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు కలకలం రేపాయి. అగ్ని ప్రమాదం జరుగగా బండారం బయటపడింది. దీంతో ఆయనపై చర్యలకు సిఫారసు చేసింది కొలీజియం. వివరాల్లోకి వెళ్తే..ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో జరిగిన అగ్నిప్రమాదం తర్వాత భారీ మొత్తంలో నగదు లభ్యం కావడం కలకలం రేపింది.

అయితే అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీలో లేరు. అగ్నిప్రమాదం గురించి కుటుంబ సభ్యులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మంటలు ఆర్పివేసిన తర్వాత, అగ్నిమాపక సిబ్బందికి ఒక గదిలో భారీగా నోట్ల కట్టలు కనిపించాయి.

దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా తీవ్రంగా స్పందించారు. ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయగా 2021 అక్టోబర్‌లో అలహాబాద్ నంచే ఢిల్లీ హైకోర్టుకు వచ్చారు. దీనిపై వర్మ నుండి వివరణ కోరిన అనంతరం ఆయన సమాధానం సంతృప్తికరంగా లేకపోతే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆ క‌మిటీ నివేదిక ఆధారంగా చ‌ర్య‌లు తీసుకోనున్నారు.

Also Read:ఎన్నికల ముందు హామీల జాతర..ఎన్నికలయ్యాక హామీల పాతర!

- Advertisement -