కూకట్‌పల్లి హోలిస్టిక్ హాస్పిటల్స్‌లో అగ్నిప్రమాదం..

130
- Advertisement -

కెపిఎచ్‌బి పోలీసు స్టేషన్ పరిధి నిజాంపేట్ లోని హోలిస్టిక్ హాస్పిటల్స్ లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. ఐదు అంతస్తులు కలిగి ఉన్న ఆసుపత్రి భవనంలో దట్టమైన మంటలు,పొగ అలుముకోవడంతో లోపల ఉన్న రోగులు, వారి తరుపు బంధువులు, మరియు ఆసుపత్రి సిబ్బంది 70 మంది దాకా బైటికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.పక్క భవనాలపై నుండి బాధితులను అగ్ని మాపక సిబ్బంది కాపాడారు.

అయితే కింద సెల్లార్ లో జరిగిన షాక్ సర్కూట్ కారణంగా భవనమంతా పొగలు, మంటలు వ్యాపించాయని,ప్రాణ నష్టమేమీ కాకుండా అధికారులు,చుట్టూ ఉన్న వారి సాయంతో ఆసుపత్రి లోని వారిని కాపాడారని ఎమ్మెల్యే వారికే పూడి గాంధీ తెలిపారు. సమాచారం తెలుసుకున్న మాదాపూర్ జోన్ డిసిపి శిల్పవల్లి క్షతగాత్రులను పలు ఆంబులెన్స్ లలో వేరే ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని డిసిపి తెలిపారు.

- Advertisement -