వరంగల్‌లో అగ్నిప్రమాదం…10 మంది మృతి

282
Fira accident at Warangal
- Advertisement -

వరంగల్‌లో విషాదం చోటు చేసుకుంది. కోటిలింగాల వద్ద భద్రకాళి ఫైర్ వర్క్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పది మృతిచెందగా పలువురు కార్మికులు గాయపడ్డారు. భారీ శబ్దాలతో పేలుడు సంభవించడం,మంటలు చెలరేగడంతో పలువురు కార్మికులు బయటకు పరుగులు తీశారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి మంటలను అదుపులోకి తెచ్చాయి.

ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పదిమంది అక్కడిక్కడే సజీవ దహనం అయ్యారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్ధితి విషమంగా ఉంది. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కార్మికుల మృతితో కోటిలింగాల వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం క్షతగాత్రులకు ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

వరంగల్ ఫైర్ యాక్సిడెంట్‌పై తీవ్రదిగ్భ్రాంతి  వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి  ప్రకటించారు. ప్రమాదంలో మరణించిన వారికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

fire accident

- Advertisement -