ఎన్టీఆర్‌ చిన్నకొడుకు పేరేంటో తెలుసా..!

175
ntr second name

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌రోసారి తండ్రి అయిన విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో తారక్‌ తన చిన్న కుమారుడికి పేరు పెట్టాడు. వారసత్వంగా వస్తున్న తారక రాముడి(ఎన్టీఆర్‌) పేరు కలిసివచ్చేలా నామకరణం చేశాడు. పెద్దకొడుక్కి అభయ్ రామ్‌ అని పేరుపెట్టిన తారక్ చిన్న కొడుక్కి భార్గవ్ రామ్‌ అని పేరుపెట్టాడు.

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్ దంపతులు పంచుకున్నారు. ఎన్టీఆర్ దంపతులు క్యూట్‌గా ఉన్న ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తారక్, లక్ష్మీ ప్రణతి దంపతులకు 2014లో అభయ్ రామ్ జన్మించగా.. జూన్ 14న రెండో బాబు జన్మించాడు.