ఏటీఎం ఛార్జీల బాదుడుకు బ్రేక్..

186
FinMin eases cash withdrawal limits in ATMs, banks
- Advertisement -

ఏటీఎం లావాదేవీల పరిమితులపై బ్యాంకులు ఆలోచనలోపడ్డాయి. రూ.500,రూ.1000 నోట్ల రద్దుతో ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెలకు ఐదు సార్లు మాత్రమే ఏటీఏంను ఉపయోగించుకోవాలన్న నిబంధనలను ఆర్బీఐ సడలించింది. ఏటీఎంల ద్వారా జరిపే అన్ని లావాదేవీలపై డిసెంబరు 30వ తేదీ వరకు ఛార్జీలను రద్దు చేసింది. ఇది సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాదార్లకు వర్తిస్తుంది.

తమ బ్యాంకుల ఏటీఎంలతో పాటు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలలో ఎన్నిసార్లు లావాదేవీలు (ఆర్థిక, ఆర్థికేతర) జరిపినా ఎటువంటి ఛార్జీలు వసూలు చేయబోరని సాయంత్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం సొంత బ్యాంకు ఏటీఎంల నుంచి నెలకు అయిదు సార్లు, ఆరు మెట్రో నగరాల్లో ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నెలకు మూడు సార్లు మాత్రమే ఉచితంగా లావాదేవీలు జరిపే అవకాశం ఉంది. ఈ పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి రూ.20 వంతున వసూలు చేస్తారు. పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో కొత్త నోట్లు పొందడానికి పరిమితులు విధించడంతో ఏటీఎంల నుంచి పలుమార్లు నగదు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఏటీఎం ఛార్జీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొంది.

నోట్ల రద్దుతో ఏర్పడ్డ నగదు సంక్షోభం నేపథ్యంలో పాతనోట్ల వినియోగంపై ఆంక్షల్ని కేంద్ర ప్రభుత్వం మరికొన్ని రోజులు సడలించింది. పౌర సేవల బిల్లులు చెల్లించేందుకు, పెట్రోల్‌ బంకుల్లో, రైల్వే, విమాన టికెట్ల కొనుగోలుకు నవంబర్‌ 24 వరకూ రూ.500, రూ.వెయ్యి నోట్లను వినియోగించవచ్చని పేర్కొంది. పౌరసేవల బిల్లులతో పాటు ఇతర పన్నులు, ఫీజులు పాత నోట్లతో చెల్లించవచ్చని వెల్లడించింది.పాత బిల్లుల చెల్లింపునకే ఈ నిబంధనలు వర్తిస్తాయమని ముందస్తు చెల్లింపు చేయకూడదని కేంద్రం తెలిపింది.

- Advertisement -