మహిళా సంఘాలకు వడ్డీరేటు తగ్గించాలి

374
harish
- Advertisement -

రాష్ట్రంలోని మహిళా సంఘాలకు వడ్డీ రేటును తగ్గించాలని బ్యాంకు అధికారులకు సూచించారు మంత్రి హరీశ్ రావు. హైదరాబాద్ బేగంపేట్ లోని మ్యారిగోల్డ్ హోటల్‌లో 25వ స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ క్వార్టర్లీ సమావేశానికి మంత్రి హరీశ్‌ రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్‌ సెక్రటరీ రామకృష్ణారావు, అగ్రికల్చర్ కమిషనర్ రాహుల్ బొజ్జ, వివిధ బ్యాంకుల చీఫ్ మేనేజర్స్ హాజరయ్యారు.

ఈసందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… ‘రైతుబంధు పథకం కింద జమ చేసిన మొత్తంలో రైతులకు చెల్లించింది పోగా మిగిలిన మొత్తాన్ని 15 రోజుల్లోగా ప్రభుత్వానికి చెల్లించాలని సూచించారు. ప్రభుత్వ వివిధ శాఖల్లో, వివిధ స్థాయి అధికారుల అకౌంట్లలో ఉన్న డిపాజిట్లు జనవరి 10లోగా వివరాలు అందించాలి. సామాజిక పెన్షన్స్ పథకం కింద చనిపోయిన వారి వివరాలు పంచాయతీ శాఖ ద్వారా బ్యాంక్ లకి వివరాలు అందించగానే ,మిగిలిన అమౌంట్ ని జనవరి లోగా తిరిగి ప్రభుత్వానికి అందించాలి. గత ఋణ మాఫీ లో ఆడిట్ సందర్బంగా తెల్సిన అంశాలు బ్యాంకర్స్ కు మంత్రి వివరించారు.

- Advertisement -