దివంగత నందమూరి తారక రామారావు బయోపిక్‌ను ఎన్టీఆర్ పాత్రలో నటిస్తూ, నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కించడానికి బాలకృష్ణ గట్టి ప్రయత్నాలే చేశాడు. తేజ డైరెక్షన్లో ఈ మెగా ప్రాజెక్టును పట్టాలెక్కించే ప్రయాత్నాల్లో భాగంగా ఉన్నట్టుండి తేజ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. తేజ తప్పుకోవటంతో బాలకృష్ణ ఆలోచనల్లో పడ్డాడు.
ఆ తర్వాత ఈ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు ఒక్కొక్కరి పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ లీస్టులో రాఘవేంద్రరావు, బాలకృష్ణ ఉండగా వీరిద్దరిలో ఎవరో ఒకరు ఈ సినిమాను తెరకెక్కిస్తారనే వార్తలు ఊపందుకున్నాయి. కానీ తాజాగా ఉన్నట్టుండి ఈ బయోపిక్కు డైరెక్టర్‌గా క్రిష్ పేరు వినిపిస్తోంది. గతంలో క్రిష్ బాలకృష్ణతో ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమా రూపొందించిన విషయం తెలిసిందే. భారీ సినిమాలు రూపొందించగల సమర్ధుడని భావించి బాలకృష్ణ ఈ సినిమాను క్రిష్‌కు అప్పజెప్పినట్లు తెలుస్తోంది.
క్రిష్ ప్రస్తుతం వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత కథ ఆధారంగా ‘మణికర్ణిక’ అనే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో మెయిన్ రోల్లో కంగనా రనౌత్ నటిస్తోంది. ఈ సినిమా పూర్తైన తర్వాత క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలోగా బాలకృష్ణ వీ.వీ వినాయక్‌తో ఓ సినిమా చేయనున్నారట.