బిగ్ బాస్ సీజన్ 3 మరో మూడు రోజుల్లో ముగియనుంది. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన 17మందిలో చివరి వారం 5గురు సభ్యులు మిగిలారు. శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రెజా, రాహుల్ వీరిలో ఎవరో ఒకరు బిగ్ బాస్ టైటిల్ ను సొంత చేసుకోనున్నారు. కాగా నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ మెట్స్ 100రోజుల జర్నిని ఒక్కొక్కరిని యాక్టివిటి రూం కి పలిచి చూపించారు. ఇంత గొప్ప అచీవ్మెంట్ సాధించిన ఈ ఐదుగురి బిగ్ బాస్ జర్నీలో ఎన్నో కోపాలు, ఆవేశాలు,ప్రేమలు, ఎమోషన్స్ ఉన్నాయి. వీటన్నింటిని స్మాల్ స్క్రీన్‌పై చూపించి ఇంటి సభ్యులు భావోద్వేగానికి గురయ్యేలా చేశారు బిగ్ బాస్.
ముందుగా వరుణ్ సందేశ్‌ని యాక్టివిటీ ఏరియాలోకి పిలిచిన బిగ్ బాస్ అతని గురించి మాట్లాడారు. ‘మిమ్మల్ని ప్రాబ్లమ్ సాల్వర్, మిస్టర్ కూల్, మిస్టర్ పర్ఫెక్ట్ అని పిలుస్తారు. మీరు హౌస్‌లో చాలా బాధ్యతగా వ్యవహరించారు. భార్యతో వచ్చినప్పటికి గేమ్‌ని మాత్రం గేమ్‌లానే ఆడారు. మీ ప్రయాణంలో ఎన్నో అనుభూతులు ఉన్నాయి. వాటిని చూసి ఆస్వాదించండి అని బిగ్ బాస్ వీడియో ప్లే చేశారు. ఇది చూసిన వరుణ్ కాస్త భావోద్వేగానికి లోనయ్యాడు.
తర్వాత బాబా భాస్కర్ యాక్టివిటీ ఏరియాలోకి రాగా, బాబా భాస్కర్ని ఆకాశానికి ఎత్తేశారు బిగ్ బాస్. డ్యాన్సర్‌గా, కుక్‌గా, చిన్నపిల్లాడిలా మీరు పంచిన వినోదం చాలా నచ్చింది. బిగ్ బాస్‌ని గురువు గారు అని పిలిచి మా మనసు గెలుచుకున్నారు. పెద్ద మనిషి తరహాలో ఇంటి సభ్యుల బాగోగులు చూసుకుంటూ వచ్చిన మీరు జీవితంలో ఎంతో సాధించాలని కోరుకుంటున్నాం అని బిగ్ బాస్ తెలిపారు . అనంతరం బాబా భాస్కర్ జర్నీకి సంబంధించిన వీడియో ప్లే చేయగా, ఆ వీడియోని చూసిన బాబా భాస్కర్ ముందుగా ఫుల్ ఎంజాయ్ చేశారు.తరువాత తరువాత అందులోని ఎమోషన్స్, లవ్, సీరియస్ బాబా భాస్కర్ కంట కన్నీరు ఆగకుండా చేశాయి.మీ భావాలని మాతో షేర్ చేసుకోవచ్చు అని బిగ్ బాస్ చెప్పగా, బాబా మాత్రం ఏడుస్తూనే ఉన్నారు. నేను చాలా సెన్సిటివ్. యాక్టింగ్ రాదు అని చాలా ఎమోషనల్ అయ్యారు బాబా.