రామ్ ‘రెడ్’ విడుదల తేదీ ఖరారు

214
red-release

ఇస్మార్ట్ శంకర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు హీరో రామ్. ఈమూవీ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈమూవీ భారీగా కలెక్షన్లు రాబట్టింది. ఇక రామ్ తన తర్వాతి మూవీని ప్రారంభించాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈమూవీకి రెడ్ అనే టైటిల్ ను ఖారారు చేశారు. స్రవంతి రవికిషోర్ ఈసినిమాను నిర్మిస్తున్నారు.

కెరీర్‌లో తొలిసారి థ్రిల్లర్ జోనర్‌లో సినిమా చేస్తున్నాడు రామ్ . న‌వంబ‌ర్ 16 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌గ‌నుండ‌గా, రీసెంట్ చిత్ర పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి పూరీ జ‌గ‌న్నాథ్‌, చార్మి త‌దిత‌ర ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. మ‌ణిశ‌ర్మ‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

కాగా ఈసినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేయనున్నట్లు తెలిపారు. తాజాగా ఈమూవీ విడుదల తేదిని ప్రకటించారు చిత్రయూనిట్. వచ్చే ఏడాది ఏప్రిల్ 9న ఈమూవీని విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్ విడుదల చేశారు. కాగా కిషోర్ తిరుమల, రామ్ కాంబినేషన్ లో ఉన్నది ఒకటే జిందగి, నేను శైలజ మూవీలు తెరకెక్కిన సంగతి తెలిసిందే.