ముదురుతున్న సినీ కార్మికుల వివాదం..

56
Film industry workers strike
- Advertisement -

సినీ కార్మికుల ఆందోళన నేపథ్యంలో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి తెలుగు ఫిలిం ఫెడరేషన్ కు మధ్య వివాదం ముదిరింది. ఈ క్రమంలో టాలీవుడ్ లో పలు చిత్రాల షూటింగ్ లు నిలిచిపోయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న 28 సినిమాల షూటింగ్‌లు బంద్ చేశారు. అయితే ఈ రోజు నుంచి ఎథావిధిగా షూటింగ్స్‌లో పాల్గొనాలి అని తెలుగు పిలిం ఛాంబర్ కోరింది. లేని పక్షంలో అరు నెలల పాటు షూటింగ్స్ నిలిపి వేస్తామని నిర్మాతల మండలి వెల్లడించింది.

ఈ సందర్భంగా నిర్మాతలు ఎవ్వరూ కార్మిక సంఘాల ఒత్తిళ్లకు గురి కావొద్దు అని తెలుగు ఫిలిం ఛాంబర్ కోరింది. అయితే ఎట్టిపరిస్థితుల్లో వేతనాలు పెంచేంత వరకు షూటింగ్ లకు హాజరుకామని ఫెడరేషన్ సభ్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న రెమ్యునరేషన్ కన్నా 45 పర్సెంట్ ఎక్కువ ఇవ్వాలి అని ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. సినీ కార్మికుల్లో విభేదాలు సృష్టిస్తే నష్టా పోయేది నిర్మాతలే అని ఫెడరేషన్ సభ్యులు అంటున్నారు. అయితే ఈ వివాదానికి పరిష్కరించే దిశగా సిని పెద్దలు రంగంలో దినున్నారని తెలుస్తోంది.

- Advertisement -