ఫిల్మ్‌ ఫేర్‌ 2021 అవార్డు విజేతలు వీరే..

279
Film fare Awards 2021
- Advertisement -

శనివారం ముంబై వేదిక‌గా 66వ ఫిలింఫేర్ అవార్డుల వేడుక ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు బాలీవుడ్ సినీ తార‌లు సంద‌డి చేశారు. ఈవెంట్‌లో తాప్సీ, ఆయుష్మాన్ ఖురానా, స‌న్నీ లియోన్, నోరా ఫ‌తేహి, రితేష్ దేశ్‌ముఖ్‌, రాజ్‌కుమార్ రావు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

ఆంగ్రేజ్ మీడియం చిత్రంలో అద్భుత న‌ట‌న క‌న‌బ‌ర‌చిన ఇర్ఫాన్ ఖాన్‌కు బెస్ట్ యాక్ట‌ర్ అవార్డ్ ద‌క్కింది. అలానే లైఫ్ టైమ్ అచీవ్ అవార్డ్ కూడా ఈ విల‌క్ష‌ణ న‌టుడికే ద‌క్కింది. అయితే ఇర్ఫాన్ గ‌త ఏడాది ఏప్రిల్ 29న క్యాన్స‌ర్ వ‌ల‌న క‌న్నుమూశారు. ఇర్ఫాన్‌కు వ‌చ్చిన అవార్డుల‌ని ఆయ‌న కుమారుడు బాబిల్ స్వీక‌రించారు.

ఇక ఉత్త‌మ న‌టిగా తాప్సీ త‌ప్ప‌డ్ చిత్రానికి గాను అవార్డ్ అందుకుంది. ఇక బెస్ట్ యాక్ట‌ర్(క్రిటిక్స్) గా అమితాబ్ బ‌చ్చ‌న్ గులాబో సితాబో చిత్రానికి గాను అవార్డ్ స్వీకరించారు. బెస్ట్ స‌పోర్టింగ్ రోల్ ( న‌టుడు) సైఫ్ అలీ ఖాన్, స‌పోర్టింగ్ రోల్ (న‌టి) ఫ‌రోక్ జోఫ్ఫ‌ర్ అవార్డ్ అందుకున్నారు. ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా ఓం రౌత్ తాన్హాజీ చిత్రానికి అవార్డ్ అందుకోగా, బెస్ట్ మూవీగా త‌ప్ప‌డ్ చిత్రం నిలిచింది.

2021 ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు విజేతలు:

ఉత్తమ చిత్రం- థప్పడ్
ఉత్తమ దర్శకుడు- ఓం రావత్ (తానాజీ: ది అన్సంగ్ వారియర్)
ఉత్తమ చిత్రం(క్రిటిక్స్‌ ఛాయిస్‌)-ప్రతీక్ వాట్స్ (ఈబ్ అల్లే ఓహ్!)
ఉత్తమ నటుడు-ఇర్ఫాన్ ఖాన్‌ (ఆంగ్రేజీ మీడియం)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌ ఛాయిస్‌)-అమితాబ్ బచ్చన్ (గులాబో సితాబో)
ఉత్తమ నటి-తాప్సీ పన్నూ (థప్పడ్)
ఉత్తమ నటి (క్రిటిక్స్‌ ఛాయిస్‌)-తిలోత్తమా షోమ్ ( సర్)
ఉత్తమ సహాయ నటుడు-సైఫ్ అలీ ఖాన్ (తానాజీ: ది అన్సంగ్ వారియర్)
ఉత్తమ సహాయ నటి- ఫరోఖ్ జాఫర్(గులాబో సితాబో)
ఉత్తమ కథ- అనుభవ్ సిన్హా , మృన్మయి లగూ వైకుల్ (థప్పడ్)
ఉత్తమ స్క్రీన్ ప్లే-రోహేనా గెరా (సర్)
ఉత్తమ సంభాషణ-జుహి చతుర్వేది (గులాబో సితాబో)
ఉత్తమ తొలి దర్శకుడు-రాజేష్ కృష్ణన్ (లూట్‌కేస్)
ఉత్తమ సంగీతం-ప్రీతమ్(లూడో)
ఉత్తమ సాహిత్యం-గుల్జార్ (చప్పక్)
లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్‌ అవార్డు- ఇర్ఫాన్‌ ఖాన్‌
బెస్ట్‌ యాక్షన్‌-రంజాన్ బులుట్, ఆర్పి యాదవ్ (తానాజీ: ది అన్సంగ్ వారియర్)
ఉత్తమ నేపథ్య స్కోరు-మంగేష్ ఉర్మిలా ధక్డే (థప్పడ్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ-అవిక్ ముఖోపాధ్యాయ్ (గులాబో సితాబో)
ఉత్తమ కొరియోగ్రఫీ-ఫరా ఖాన్ (దిల్ బెచారా)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్-వీర కపూర్ ఈ (గులాబో సితాబో)
ఉత్తమ ఎడిటింగ్-యషా పుష్ప రామ్‌చందాని (థప్పడ్)

- Advertisement -