- Advertisement -
మనిషి చావుకు కారణమైన కోడిపై కేసు నమోదైంది. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కొండాపూర్‌కు చెందిన తనుగుల సత్తయ్య కోడిపందాలు ఆడేవాడు.
ఇందులో భాగంగా గొల్లపల్లి మండలం లొత్తునూరులో కోడిపందాలు ఆడటం కోసం కోడికి కత్తులు కడుతుండగా అవి గుచ్చుకున్నాయి. దాంతో ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే సత్తయ్యకు తీవ్ర గాయాలుకావడంతో రెండు రోజుల క్రితం మృతిచెందాడు. దర్యాప్తులో భాగంగా కోడిని రిమాండ్ తరలించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
- Advertisement -