ఎన్టీఆర్‌-కళ్యాణ్ రామ్‌ల గొడవేంటీ?

209
Fight between NTR and Kalyanram
Fight between NTR and Kalyanram
- Advertisement -

జై లవకుశ సినిమాలో లవ కుమార్‌ కేరక్టర్ వచ్చేసింది.. అదిరిపోయే తో లుక్స్‌తో కేక పుట్టిస్తున్నాడు ఎన్టీఆర్.. మొన్న జై.. ఇప్పుడు లవ.. ఈ క్యారెక్టర్లతో జై లవకుశ సినిమా పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. సోషల్‌ మీడియాలో మీడియాలో ఎక్కడ చూసినా జై లవకుశ సినిమా గురించే డిస్కషన్. అయితే ఇదే టైం లో సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మధ్య గొడవలు జరుగుతున్నాయని, వీరిద్దరూ మాట్లాడుకుని దాదాపు నెలరోజుల పైనే అయిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Jai Lava Kusa Movie Audio Release Date

మరి ఈ న్యూస్ నిజమేనా.. ఇందుకు కారణం ఏంటీ? జై లవకుశ బడ్జెట్ ఎక్కువైందా?.. బడ్జెట్ విషయంలో కళ్యాణ్ రామ్ సీరియస్ గా వున్నాడా?.. ఎన్టీఆర్‌పై కళ్యాణ్‌రామ్ కోపంగా ఉన్నాడా? బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు విభిన్న కేరక్టర్లు చేస్తున్నాడు. జై లవకుశ సినిమాను ఎన్టీఆర్ బ్యానర్ పై తీస్తున్నారు.. నిర్మాతగా కళ్యాణ్ రామ్ కు ఇదిచాలా ప్రతిష్ఠాత్మకమైంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ కు హిట్స్‌ వచ్చి చాలా కాలమైంది. చివరి సినిమా రవితేజ హీరోగా కిక్‌2తో కళ్యాణ్ రామ్ చాలా నష్టపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో అన్నా కళ్యాణ్ రామ్ కు మంచి హిట్టు ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాకు ఒప్పుకున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. అయితే ఈ సినిమా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువగా వచ్చిందని అందుకే కళ్యాణ్‌ రామ్‌ ఎన్టీఆర్ పై కోపంగా ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి

అయితే ఇలాంటి వార్తలను కొట్టి కొట్టి పారేశారు కళ్యాణ్.. సినిమా అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చిందని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో ది బెస్ట్ సినిమాగా ఉంటుందని కళ్యాణ్‌రామ్ ధీమా వ్యక్తం చేశాడు.. అలాగే భవిష్యత్తులో తమ్ముడు ఎన్టీఆర్తో మరిన్ని సినిమాలు చేస్తానని కళ్యాణ్‌రామ్ చెప్పాడు. జైలవకుశ సినిమా షూటింగ్‌ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో ను సెప్టెంబర్ 3న విడుదల చేస్తున్నారు.. ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేస్తున్నారు.

- Advertisement -