బొట్టు పెట్టుకోవడం నా కూతురు చేసిన పొరపాటా..?

261
madarsa
- Advertisement -

బొట్టు పెట్టుకుందని ఓ విద్యార్థినిని మదర్సా యాజమాన్యం బహిష్కరించింది. బొట్టు పెట్టుకోవడం ముస్లిం సాంప్రదాయాలకు విరుద్దమంటూ విద్యార్థినిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

తిరువనంతపురంలోని మదర్సాలో 5వ తరగతి చదువుతోంది హీనా అనే అమ్మాయి. చదువుతో పాటు నటనపై ఆసక్తి ఉన్న ఆ విద్యార్థిని, ఓ షార్ట్ ఫిలింలో నటించేందుకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో నుదుటిపై గంధపు బొట్టు పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న మదర్సా యాజమాన్యం ముస్లిం అయిఉండి బొట్టు పెట్టుకుంటావా..? అంటూ విద్యార్థినిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతటితో ఆగలేదు.. ఆ విద్యార్థినిని మదర్సా నుంచి బహిష్కరించింది.

kerela madarsa

ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని తండ్రి ఉమర్ మలయిల్ సోషల్ మీడియా వేదికగా యాజమాన్యంపై మండిపడ్డారు. ఎంతో ప్రతిభ ఉన్న తన కూతురిని మదర్సా నుంచి బహిష్కరించడం దారుణమన్నారు. బొట్టు పెట్టుకోవడమే.. తన కూతురు చేసిన తప్పా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుతో పాటు ఆట,పాటల్లోనూ తన కూతురు ఎన్నో బహుమతులు గెలిపొందిందని తెలిపారు. యాజమాన్యం తీరుపై ఎలా స్పందించాలో కూడా అర్థం కావడం లేదంటూ ఫేస్ బుక్ పోస్టులో పేర్కొన్నారు.

ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైలర్ అవుతోంది. బొట్టు పెట్టుకుంటే తప్పేంటని మదర్పా యాజమాన్యంపై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. చేసిన తప్పుకు సరైన శిక్ష పడిందంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -