సునీల్.. స్పీడ్ పెంచాడు..

250
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సునీల్. అనంతరం కమెడియన్ నుంచి కథానాయకుడిగా ఎదిగారు. మొదట్లో అన్ని విజయాలు వరించినా… తరువాత  విజయం కోసం ఎదురు చూసినా.. ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో మళ్లీ కమెడియన్ గా చేయడానికి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కమెడియన్ గా సునీల్ రీ ఎంట్రీ ఇస్తుడడంతో వరుస అవకాశాలు ఆయనను వరిస్తున్నాయి.

SaiDharam

ఇప్పటికే శ్రీనువైట్ల-రవితేజ కాంబినేషన్ లో వస్తోన్న ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలో చాన్స్ కొట్టేశాడు. మెగా హీరో సాయిధరమ్ తేజ్ సినిమాలోనూ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ సునీల్ చేయనున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘చిత్రలహరి’ బార్ అండ్ రెస్టారెంట్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇదిలా ఉండగానే శర్వానంద్ తాజా చిత్రంలోనూ సునీల్ కమెడియన్ గా అలరించనున్నాడు.

అంటే సునీల్ కమెడియన్ గా మళ్లీ స్పీడు పెంచాడనే చెప్పాలి. స్టార్ హీరోల నుంచి చోటా హీరోల సినిమాల వరకు, ఆయన లేకుండా దాదాపు సినిమాలు వచ్చేవి కావు. తాజాగా మళ్లీ కమెడియన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సునీల్ అదే తరహాలో ప్రేక్షకులను నవ్విస్తాడో లేదో చూడాలి.

- Advertisement -