ప్రపంచపోరుకు ఖతార్ వేదికగా మారింది. యూరోప్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడా…ఫుట్‌బాల్. ఈ క్రీడ కోసం ఖతార్ అన్ని ఏర్పాట్లు చేసింది. తొలి మ్యాచ్‌కు 60వేల కెపాసిటీ ఉన్న అల్‌బయత్ స్టేడియం ఆతిథ్యమివ్వనుండగా, 80వేల సామర్థ్యమున్న లుసైల్ స్టేడియంలో ఫైనల్ జరుగనున్నది.
మొత్తం 64 మ్యాచ్‌లు నెల రోజుల పాటు అభిమానులకు ఆనందం పంచనున్నాయి. ఆరు మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 ఆరంభం కానుండగా రాత్రి 6.30 తరువాతే జరుగుతాయి. ప్రారంభ మ్యాచ్ రాత్రి 9.30కు ఖతార్, ఈక్వెడార్‌ల మధ్య జరుగనుంది.
ఆతిథ్య జట్టుగా ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకుంది. ఖతార్ తొలి మ్యాచ్‌లో దక్షిణ అమెరికాకు చెందిన ఈక్వెడార్‌తో తలపడనుంది. ప్రతి గ్రూప్‌లో నాలుగేసి జట్లు ఉంటాయి. వాటిలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్‌కు చేరుకుంటాయి. అలా మొత్తం 8గ్రూప్‌లుగా విభజించబడి 32జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్ మ్యాచ్‌లో ప్రతి విజయానికి మూడు పాయింట్లు డ్రాకు ఒక పాయింటు లభిస్తుంది.
డిసెంబర్ 3న రౌండ్ పోటీలు జరగగా డిసెంబర్ 9నుంచి క్వార్టర్స్ 14,15తేదీలలో సెమీఫైనల్స్ జరగనున్నాయి. 17న మూడో స్థానం కోసం పోటీ పడగా 18న ఫైనల్ జరగనుంది. ఈమొత్తం మ్యాచ్‌ల కోసం ఖతార్ నాలుగు స్టేడియంలను నిర్మించింది. ఎడ్యూకేషన్ సిటీ స్టేడియం, స్టేడియం974, అల్‌బయత్ స్టేడియం, ఫైనల్ కోసం లూసెయిల్ స్టేడియంను నిర్మించారు. మరీ ప్రతి రోజు ఆటను ఆస్వాదిస్తూ డిసెంబర్ 18న జరిగే మ్యాచ్ కోసం వేచి చూడాలి.
గ్రూప్‌ల వారీగా జట్ల వివరాలు…
గ్రూపు ఎ
ఖతార్, ఈక్వెడార్, సెనెగల్, నెదర్లాండ్స్
గ్రూపు బి
ఇంగ్లండ్, ఇరాన్, అమెరికా, వేల్స్
గ్రూపు సి
అర్జెంటీనా, సౌదీ అరేబియా, మెక్సికో, పోలండ్
గ్రూపు డి
ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, ట్యునీసియా
గ్రూపు ఇ
స్పెయిన్, కోస్టారికా, జర్మనీ, జపాన్
గ్రూపు ఎఫ్
బెల్జియం, కెనడా, మొరాకొ, క్రొయేషియా
గ్రూపు జి
బ్రెజిల్, సెర్బియా, స్విట్జర్లాండ్, కామెరూన్
గ్రూపు హెచ్
పోర్చుగల్, ఘనా, ఉరుగ్వే, దక్షిణ కొరియా
ఇవి కూడా చదవండి….