ఫిఫా..అర్జెంటీనా వర్సెస్ ఫ్రాన్స్‌

56
- Advertisement -

ఫిఫా ప్రపంచకప్‌ 2022లో భాగంగా ఫైనల్‌కి దూసుకెళ్లింది ఫ్రాన్స్‌. రెండో సెమీ ఫైనల్లో మొరాకతో జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ ఘన విజయం సాధించింది. 2-0 తేడాతో ఫ్రాన్స్‌ గెలుపొందింది. ఫ్రాన్స్ ఆటగాళ్లు హెర్నాండెజ్, రాండల్ ధాటిగా ఆడడంతో ఆ జట్టు 2 గోల్స్ సాధించగా, మొరాకో ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది.

దీంతో డిఫెండింగ్ ఛాంపియన్‌ ఫ్రాన్స్  వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది. క్వార్టర్ ఫైనల్లో అద్భుతంగా రాణించి సెమీఫైనల్ కు చేరిన మొరాకో ఈ మ్యాచులో మాత్రం రాణించలేకపోయింది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనాతో తలపడనుంది ఫ్రాన్స్‌.

ఫిఫా ప్రపంచ కప్‌-2022లో మూడో స్థానం కోసం శనివారం మొరాకో-క్రొయేషియా తలపడతాయి.  1986 ప్రపంచ కప్ ఫైనల్లో అర్జెంటీనా విజయం సాధించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మరోసారి ప్రపంచ కప్ గెలుచుకోలేదు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -